మౌనం


ఎందుకీ మౌనం
అసలిది మౌనమా? లేక
భావోద్వేగం విధించినా సంకెలా?

ఉన్నట్టుండి నన్నావహించే ఈ  భావావేశానికి అసలు
ఏ పేరు పెట్టాలి!
కోపమా? ప్రేమా? అసూయా? స్నేహమా?
సందిగ్ధంలో పడటమే తప్ప బదులు దొరకదే
నాకు నే సర్ది చెప్పుకోవడం తప్ప సర్దుమనగదే

కొద్దిసేపటి ఈ సడిలేని కారాగారం
ఎన్నో ప్రశ్నల్ని రేకెత్తిస్తుంది
ప్రతీది ఎందుకంత అమితమంటూ నిగ్గదీస్తుంది
ఇకనైనా తమాయించుకోమంటూ హెచ్చరిస్తుంది
ఒక్కటి మాత్రం స్పష్టంగా అవగతమయ్యేలా చేస్తుంది
నీ మనఃశాంతిని నీకు నువ్వే హరించుకుంటున్నావని
నీ వ్యక్తిత్వానికి నువ్వే గ్రహణం పట్టించుకుంటున్నావని

తెలుస్తుంది మనసుకిది
కాని ఎందుకో అదిగమించలేకపోతుంది
బలహీనతే తలెత్తుకు తిరుగుతుంది
బలాన్ని నిర్దాక్షిణ్యంగా కూలదోస్తుంది

అయినా
కాలమను కల్లోలినిలో పరిగెత్తే ప్రతీ ఒక్కరు
పరిస్థితుల గాలానికి చిక్కవల్సిందేగా
చిత్రవిచిత్రానుభవాల్ని అనుభవిస్తూ సాగిపోవల్సిందేగా.





Comments

Post a Comment

Popular posts from this blog

మధురభావాలు

ముఖాముఖి

సాగర తీరం