వేడుక
పిరికివాడికి సంపద
ధైర్యవంతుడికి ఆపద
పిరికివాడు ఆపదనెదుర్కోలేడు కనుకే
దేవుడు సంపదను మూటగట్టి శ్రీమంతుడిని చేస్తాడు.
ధైర్యవంతుడికి ఆపద మీద ఆపదనిచ్చి దారిద్ర్యంలో ఊగిసలాడుతూ ఇంకెలా పైకొస్తావో చూస్తా
అని పరీక్షిస్తాడు.
అసలు ఈ సృష్టిలో ఏది శాశ్వతము కాదు అంటారుగా?
మరి శ్రీమంతుడి సంపద ఎందుకు తరగదు!
బీదవాని ఆకలి ఎందుకు తీరదు!
జీవితం అంతా ఊహల వేడుకెనా?
కనుల కనువిందు కష్టమేనా?
అవసరానికి మించిన ధనము ఎప్పటికి తృప్తినివ్వదు నిరతం ఎవరు దోచుకెల్తారో అన్న ఉలిక్కిపాటు నిద్రలేని రాత్రులు తప్ప.
Plz help to the poor people.
Atleast మీ పాప,బాబులతో ఐన వారి పుట్టినరోజులకైనా
ఉన్నవారిని పిల్చి తిని,తాగి ఆ తతంగం కన్నా
వాళ్ళతో ఇంకొకరికి ఆ ఒక్కరోజైనా లేనివాడికి ఇవ్వడం నేర్పించండి.
వారికి ఆశీస్సులు అందటంతో పాటు helping nature పెరుగుతుంది. కనీసామ మున్ముందు తరమైనా బాగుపడుతుంది.
మనం వ్యర్ధంగా పడేసే నాలుగు మెతుకులు దొరికితే తిని ఈ పూట బ్రతుకుదామనుకునేవారు కొకొల్లలు.
కాదంటారా?
మీరు నేలపాలు జేసే ఎంగిలి మెతుకులకై
మీ ముంగిట వేచే డొక్కెండిన జీవులెన్నో.
మీ ఇంట పాచి పాడైన విషమైనా
పరమాన్నంలా కళ్ళకద్దుకుని తినే
బక్కచిక్కిన ప్రాణాలెన్నో.
అన్నెమెరుగని శిశివు చెత్తకుప్పల పాలై పాలకై
తల్లడిల్లుతూ చిన్ని పొట్టకై చిత్రవదననుభవించే
అనాధ ఆర్తనాదాలెన్నో.
తనువిచ్చి కంటికిరెప్పల్లే పాలించి తమ కడుపుకే
పట్టెడన్నం పెట్టే కరము కరువైన శేషజీవితాలెన్నో కదూ!
అందుకే వీలైనంతగా ప్రయత్నించండి
అందరు సమానంగా సంతోషంగా బ్రతికేలా చూడండి.
Once again plz save the poor people to live.🙏
Comments
Post a Comment