Posts

Corona virus

Image
మనం సైతం: మనవరకు మనమున్నాం ఉన్నదే సర్దుకుంటూనో నిండుకున్నవి సమకూర్చుకుని కథ గడుపుకుంటూనో... కాని బిక్షాటనే వృత్తిగ కొనసాగిస్తూ గుడి ఆవలి మెట్లనే నివాసంగ మార్చుకుని కాలన్ని వెల్లదీసే వారికెవరున్నారు కొరోనా మహమ్మారి రాక మూలాన అదే సమయంలో మనందరి క్షేమమై కర్ఫ్యూ విధించిన కారణంగా వాళ్ళందరిని పోలోసులు వెల్లగొట్టడం జరిగింది. ఏదో ఓ నీడన తలదాచుకునున్నారు ఐనా ఆ కడుపులు నిండేదెలా గుళ్ళా? దర్శనానికి జనమేరి! షాపింగ్ మాల్స్ ఆ? కొనవచ్చే నాధుడేడి! ఇక రూపాయి దొరికేదెలా బుక్క లోనికి దిగేదెలా! ఆకలని చెప్పుకొన వారి గోడు వినగ ఎవడు సిద్ధమట ఎవడి ప్రాణం వాడికి తీపె కదట. మా ఊరి వైస్ చైర్మన్ చాలా పుణ్యం కట్టుకుంటున్నాడు. ఇలా దిక్కు మొక్కు లేనోళ్ళకు తనవంతుగ సాయం అందిస్తున్నాడు రోజు వాళ్ళకి భోజనాన్ని పెడుతూ పస్తు పడుకోనీకుండా... కర్ఫ్యూ కొనసాగుతుంది కాబట్టి మన బాధ్యత మనమూ ఖచ్చితంగా నిర్వహించాలి కాబట్టి అందరు వెళ్ళి సాయపడకున్నా ఎవరింట్లో వాళ్ళున్నా సరే అలా సాయపడే వాళ్ళు ప్రతీచోట ఎవరో ఒకరు ఉండుంటారు. అలా ఎవరున్నా లేకున్నా ఆ ఒక్కరు మీరే అవ్వొచ్చు లేదా వాళ్ళకు మీ వంతు సాయాన్ని అందించొచ్చు. మే...

వెతాంతమా ఇకనైనా వరించుమా......

Image
వెత గుప్పెడంత గుండెని పిండుతుంటే గుండేమో గుట్టుగ రక్తాక్షరాల్ని స్రవిస్తుంది. భయపడుతూ బ్రతుకుతున్న ప్రతీక్షణం మది ఓ సంశయంతో కూడిన సంఘర్షణలోనే చిత్రవదననుభవిస్తుంది ఏదో ఒకనాడు ఆయువు పోసిన ఈ అక్షరాలు కూడా ఒంటరిని చేసి దూరమైపోతాయేమోనని. అక్షర పరిచయమైతే గాని తెలీలేదు గుండెలో గుప్పుమంటున్న ప్రేమలోతెంతో అక్షరీకరిస్తే గాని తెలీలేదు ఈనాటి అదుపులేని చర్యలే ఒకనాటికి నిలువెత్తు సాక్ష్యాలై నిన్ను వేలెత్తి చూపుతాయని అలాగే ప్రేమగాఢతకు ప్రతీకలవుతాయని.. ప్రతీ యుద్ధానికి ఆది,అంతం అంటూ ఖచ్ఛితంగా ఉండనే ఉంటాయి.. కాని ఈ అంతర్యుద్ధానికెందుకో ఆది మాత్రమే ఉంది. అంతం ఛాయలు ఊహకు కూడా చిక్కనంత సుదూరంగా ఉన్నాయ్. కాలాన్ని వెనక్కి నెడుతూ తననెంత దరిచేర ప్రయత్నిస్తున్నా నీ వల్ల కాదంటూ నీకసలు ప్రాప్తమేలెదంటుంది. ఐనా సరే అంతం ఉందనిపిస్తుంది అది కేవలం మళ్ళీ నీరాకతోనే సాధ్యమనిపిస్తుంది.

......

Image
నీ మనసుకు వినిపించేంత గట్టిగా అరిచి చెప్పాలనుంది నా చుట్టు ప్రక్కల దిక్కులు పెక్కుటిల్లేలా బద్ధలవ్వాలనుంది ఎందుకీ నరకం ఎంతదాకా నాకీ మధనం ఎవరి గూర్చి ఇంత యాతనను అనుభవిస్తున్నామో వాళ్ళకే తెలియజెప్పుకోలేని దుస్థితేంటే నిర్భాగ్యమైన మనసా! జాలి కూడా జాలిపడుతుందే నీ దుర్భర వెతను గాంచి కన్నీరు కూడా కాలం చేస్తున్నాయే నీ నిత్య ధారల జూసి

మౌనం

Image
ఎందుకీ మౌనం అసలిది మౌనమా? లేక భావోద్వేగం విధించినా సంకెలా? ఉన్నట్టుండి నన్నావహించే ఈ  భావావేశానికి అసలు ఏ పేరు పెట్టాలి! కోపమా? ప్రేమా? అసూయా? స్నేహమా? సందిగ్ధంలో పడటమే తప్ప బదులు దొరకదే నాకు నే సర్ది చెప్పుకోవడం తప్ప సర్దుమనగదే కొద్దిసేపటి ఈ సడిలేని కారాగారం ఎన్నో ప్రశ్నల్ని రేకెత్తిస్తుంది ప్రతీది ఎందుకంత అమితమంటూ నిగ్గదీస్తుంది ఇకనైనా తమాయించుకోమంటూ హెచ్చరిస్తుంది ఒక్కటి మాత్రం స్పష్టంగా అవగతమయ్యేలా చేస్తుంది నీ మనఃశాంతిని నీకు నువ్వే హరించుకుంటున్నావని నీ వ్యక్తిత్వానికి నువ్వే గ్రహణం పట్టించుకుంటున్నావని తెలుస్తుంది మనసుకిది కాని ఎందుకో అదిగమించలేకపోతుంది బలహీనతే తలెత్తుకు తిరుగుతుంది బలాన్ని నిర్దాక్షిణ్యంగా కూలదోస్తుంది అయినా కాలమను కల్లోలినిలో పరిగెత్తే ప్రతీ ఒక్కరు పరిస్థితుల గాలానికి చిక్కవల్సిందేగా చిత్రవిచిత్రానుభవాల్ని అనుభవిస్తూ సాగిపోవల్సిందేగా.

వేడుక

Image
పిరికివాడికి సంపద ధైర్యవంతుడికి ఆపద పిరికివాడు ఆపదనెదుర్కోలేడు కనుకే దేవుడు సంపదను మూటగట్టి శ్రీమంతుడిని చేస్తాడు. ధైర్యవంతుడికి ఆపద మీద ఆపదనిచ్చి దారిద్ర్యంలో ఊగిసలాడుతూ ఇంకెలా పైకొస్తావో చూస్తా అని పరీక్షిస్తాడు.   అసలు ఈ సృష్టిలో ఏది శాశ్వతము కాదు అంటారుగా? మరి శ్రీమంతుడి సంపద ఎందుకు తరగదు! బీదవాని ఆకలి ఎందుకు తీరదు! జీవితం అంతా ఊహల వేడుకెనా? కనుల కనువిందు కష్టమేనా? అవసరానికి మించిన ధనము ఎప్పటికి తృప్తినివ్వదు నిరతం ఎవరు దోచుకెల్తారో అన్న ఉలిక్కిపాటు నిద్రలేని రాత్రులు తప్ప. Plz help to the poor people. Atleast మీ పాప,బాబులతో ఐన వారి పుట్టినరోజులకైనా ఉన్నవారిని పిల్చి తిని,తాగి ఆ తతంగం కన్నా వాళ్ళతో ఇంకొకరికి ఆ ఒక్కరోజైనా లేనివాడికి ఇవ్వడం నేర్పించండి. వారికి ఆశీస్సులు అందటంతో పాటు helping nature పెరుగుతుంది. కనీసామ మున్ముందు తరమైనా బాగుపడుతుంది. మనం వ్యర్ధంగా పడేసే నాలుగు మెతుకులు దొరికితే తిని ఈ పూట బ్రతుకుదామనుకునేవారు కొకొల్లలు. కాదంటారా? మీరు నేలపాలు జేసే ఎంగిలి మెతుకులకై మీ ముంగిట వేచే డొక్కెండిన జీవులెన్నో. మీ ఇంట‌ పాచి పాడైన విషమైనా ప...

వివాహం

Image
వివాహం అతి గొప్ప బంధం ఎంత మంది వదిలి వెడలినా కలకాలం కలిసుండమని భగవంతుడు మూడు ముళ్ళ బంధంతో ముడేసే ముచ్చటైన బంధం.   యవ్వన పల్లకిని గమ్యం చేర్చే వారధి వివాహ బంధం అప్పటివరకున్న ఒంటరి బ్రతుకులో ఒక తోడు ప్రపంచాన్ని ఇంకా అందంగా చూపిస్తుంది. ఏదో తెలియని భరోసా నాకంటూ ఒకరున్నారనే ఆత్మ సంతృప్తి చిలకా గోరింకంటి కాపురం అపుడపుడు చిరుకోపాలు అవి నీటి బుడగల్లాంటివని తెలిపే చిరు సరసాలు. సంపాదించుకున్న చిరు మొత్తాన్ని ఒకటికి పది సార్లు లెక్కపెట్టుకుని దాచుకొని కలిసి కష్టసుఖాల పంచుకోవడం. మొదటిసారి తల్లి/తండ్రి కాబోతున్నప్పటి అనిర్వచనీయ సంతోషం అనుభవించే సమయంలో తమకే తెలియని ఆనంద భాష్పాలు. ఆ కలల ఫలితం కళ్ళముందు కదలాడుతుందిక కాసేపట్లో అనుకునే క్షణంలో గుండె దడ. ఆ పసి ప్రాణం కనుతెరిచి లోకాన్ని చూసినపుడు మన కనులు రెప్ప వేయడం మరిచే క్షణాలు. తన ఎదుగుదల నుండి వివాహం వరకు తీస్కునే జాగ్రత్తలు సంతానం ఒక్కో తప్పటడుగు ఒక్కో పిడుగుపాటు వాటన్నిటిని ఎదుర్కని తీర్చి దిద్ది వారి వారి జీవితాలకొక అర్ధం కల్పించి తాతయ్య,నానమ్మ పదవి పొందడమే దేశ ప్రధానిలా గర్వపడడం ఆ శేష జీవితాన్ని సంతృప్తిగా అనుభవిస...

సాగర తీరం

Image
నిశ్శబ్దంగా కూర్చున్న అలా సాగర తీరాన చాలా ఏకాంతంగా. నీ ఎడబాటుతో నన్ను నాకు వద్దనుకునేంత అసహ్యం. అలల అలజడి సాగరంలో కన్నా నా మదిలో నీ వాణి బాణాల సడే ఎక్కువగా ఉంది. ఒక్కో అల నా పాదాన్ని తాకి వెళ్తు చెబుతుంది ఇంకో కొత్త మలుపు రాబోతుంది చూడు. వదిలి వెడలిన జత ఇంకో రూపంలో జతపడకమానదు. మేం పదే పదే నిన్ను స్పర్శిస్తూ దూరమవుతూ ఇంకో అలలా దగ్గరవుతున్నట్టు అని. ఇక నే కూర్చున్న తీరం చెబుతుంది ఎప్పుడూ తటస్థంగా ఉండు. అలలు వచ్చి నాతోనే సావాసం చేయట్లేదని నేనలిగానా? వచ్చినపుడు వద్దనను వెళ్లేటపుడు కాదనను. ప్రతీ క్షణం ఆస్వాదించు. అలల రాకపోకలకు అలజడితో చెదిరిపోకు అంది. అపుడే అవగతమైంది నా ప్రయాణం ఇంకా ఉంది. నా తీరాన్ని తాకి వెళ్ళిన ఆ అల తాత్కాలికం కాని ఎన్నో అలల ఆశాతీరం నేనని తెలిసింది. వెంటనే లేచి ముందుకు సాగా.. సాగరం సందడితో సంబరాన్ని సమకూర్చుతుందనుకున్నానేగాని సందేశాన్ని కూడా పంచుతుందనుకోలేదు. ఒక సాగరమే కాదు ప్రతీ వస్తువు, ప్రతీ ప్రదేశం,ప్రతీ భావం మనకేమైనా తెలపాలనుకుంటాయేమో! తరచి తరచి పరీక్షిస్తే ప్రతి మలుపులో ప్రతి అడుగు మనకో సందేశ భాండాగారమే.