కార్తీక దీపం


పున్నమి వెలుగులో చంద్రికలా చక్కనమ్మ చందన వర్ణ చీరలో
పంచవన్నెల చిలక పరికిణీ కట్టినట్టుగా మెరుపు తెర మేనుకు మేలిముసుగు ధరించినట్టుగా
మువ్వల కల నెరవేరేలా పదనిసలు పల్లవించేలా
నువ్ పట్టీలు పెట్టుకుని
అలా...... కదిలొస్తుంటే...
పరధ్యానం అందుకే పుట్టిందా అనిపించింది.
ఆ క్షణం నిన్నలా చూస్తూ ఉండిపోయా...
ఎక్కడున్నానో ఏం చేస్తున్నానో ఎందుకున్నానో తెలియకుండా పరుగులు పెడుతున్నా నీ వెనకాల భ్రమరానికి మతి భ్రమించిందనిపించేంతగా.
కోవెలలో కుందనపుబొమ్మలా నువ్ నిలబడి ముక్కంటిపై నీ మనసంతా లగ్నం చేసి లయ తప్పని లహరిలా మంత్రముచ్ఛరిస్తుంటే నాకు మాత్రం నన్ను వశపరుచుకునేందుకు మంత్రం జపిస్తున్నావనిపించిందే ప్రియసఖి..
నీ కోమల కౌశలంతో నువ్వలా కోనేటిలో కార్తీక దీపాన్ని జారవిడుస్తుంటే ఒక్కసారిగా నాకే తెలుపక నా గుండె జారిపోయిందే.. జావరాల.
ఆ ముక్కంటి ప్రసన్నుడయ్యాడో లేదో నీ ఆరాధనకు కాని
నేను మాత్రం భీభత్సంగా ప్రసన్నుడినయ్యా
నీ సోయగానికి ఊపిరున్నంత వరకు కోలుకోలేనంతగా.
కాస్తైనా జాలి లేదటే నీకు మరీ అంతలా కనులను కట్టీపడేసేంతలా కదిలిరావాలా.

Comments

  1. అచ్చతెలుగు ఆడపడుచు అందంగా పెట్టిన అక్షరదీపం👌👌👌

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

మధురభావాలు

ముఖాముఖి

సాగర తీరం