Corona virus

మనం సైతం:



మనవరకు మనమున్నాం ఉన్నదే సర్దుకుంటూనో
నిండుకున్నవి సమకూర్చుకుని కథ గడుపుకుంటూనో...
కాని బిక్షాటనే వృత్తిగ కొనసాగిస్తూ
గుడి ఆవలి మెట్లనే నివాసంగ మార్చుకుని కాలన్ని వెల్లదీసే వారికెవరున్నారు
కొరోనా మహమ్మారి రాక మూలాన అదే సమయంలో మనందరి క్షేమమై కర్ఫ్యూ విధించిన కారణంగా వాళ్ళందరిని పోలోసులు వెల్లగొట్టడం జరిగింది. ఏదో ఓ నీడన తలదాచుకునున్నారు
ఐనా ఆ కడుపులు నిండేదెలా
గుళ్ళా? దర్శనానికి జనమేరి!
షాపింగ్ మాల్స్ ఆ? కొనవచ్చే నాధుడేడి!
ఇక రూపాయి దొరికేదెలా బుక్క లోనికి దిగేదెలా!
ఆకలని చెప్పుకొన వారి గోడు వినగ ఎవడు సిద్ధమట
ఎవడి ప్రాణం వాడికి తీపె కదట.

మా ఊరి వైస్ చైర్మన్ చాలా పుణ్యం కట్టుకుంటున్నాడు.
ఇలా దిక్కు మొక్కు లేనోళ్ళకు తనవంతుగ సాయం అందిస్తున్నాడు
రోజు వాళ్ళకి భోజనాన్ని పెడుతూ
పస్తు పడుకోనీకుండా...
కర్ఫ్యూ కొనసాగుతుంది కాబట్టి మన బాధ్యత మనమూ ఖచ్చితంగా నిర్వహించాలి కాబట్టి
అందరు వెళ్ళి సాయపడకున్నా ఎవరింట్లో వాళ్ళున్నా సరే
అలా సాయపడే వాళ్ళు ప్రతీచోట ఎవరో ఒకరు ఉండుంటారు. అలా ఎవరున్నా లేకున్నా ఆ ఒక్కరు మీరే అవ్వొచ్చు లేదా వాళ్ళకు మీ వంతు సాయాన్ని అందించొచ్చు.
మేమూ సాయపడటానికి ప్రయత్నిస్తున్నాం ఏదో రాముడికి ఉడత సాయంలా.

చెప్పుకోటం గొప్ప కాదు చేయటం గొప్ప అంటారు. కాని ఒకరి మంచి చెబితే‌నే ఇంకో మంచికి నాంది పడుతుంది.

అందుకే మీకేం తోస్తే అది సాయం చేయండి. వాళ్ళలో వృద్ధులుండొచ్చు చిన్న పిల్లలుండొచ్చు వాళ్ళే గాక
వీధులెంబడి తిరిగే మూగజీవాలూ
అవి మాత్రం ఏం చేస్తాయ్ వీధులంచులు ఓ మనిషైనా రాకపోడ ఏమైనా పెట్టకపోడ అని ఆశగ చూడటం తప్ప. కాస్త మూగజీవాల్ని కూడా పట్టించుకోండి.మనింట్లో వాటినైతే సొంత మనుషుల్లా చూస్తాం
అవి ఓ పూట తినకుంటే అల్లాడిపోతాం
అలాగే బైటి వాటిని కనీసం ప్రాణమున్న జీవిగ గుర్తిస్తే చాలు.

చివరగా ఒకటి సాయం అన్నాం కదా అని అజాగ్రత్తగా వీధుల్లో విహరించడం కాదు. తగిన జాగ్రత్తలు పాటించాలి.
ఎందుకంటే మీ అజాగ్రత్త మిమ్మల్ని రోగులగ మార్చడమే గాక మరో ఆరోగ్యవంతుడ్ని రోగిగ మార్చే అవకాశముంది.  అపుడు సాయం కాస్త సావుకొస్తుంది.

ఈ సందర్భంలో ఓ సామెత గుర్తొస్తుంది.
మనం కుడిచేత్తో సాయం చేస్తే ఎడమచేతికి తెలీకూడదు అంటారే ఇపుడు ఆ విషయం గుర్తుంచుకోండి.
సాయం చేయ విధిగ గుంపులు గుంపులుగా తరలి పోనక్కర్లేదు
ఒకరిద్దరు చాలు. ఇదేం పత్రకల్లో చిత్రంచుకునేందుకు ఆర్భాటంగ చేయాలన్న పని కాదు.
ఆకలిమంటతో దగ్ధమవుతున్న ఓ కడుపుకి చన్నీటి ధారందించడమే.

నేను సైతం కాదు నేటి నుండి మనం సైతం ✊✊
మన దేశ జనాభా కోసం ఆయురారోగ్యాలకోసం పాటుపడదాం
పెద్దగ చేసేదెం లేదు ప్రభుత్వం చెప్పినట్టుగ సామాజిక దూరం,శుచీ శుభ్రత పాటిస్తూ మనం బావుంటూ మనతో ఇంకొంత మందిని బావుండేలా చూద్దాం.

మనిషికి మనిషేగ సాయపడేది.
మనిషికి మనిషేగ సహకరించేది.

మూగజీవాలైతే జాగ్రత్త 😑

జైహింద్ ✊ జై భారత్ 🇮🇳

Comments

Popular posts from this blog

మధురభావాలు

ముఖాముఖి

సాగర తీరం